చెట్లు నరకాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి

7 Dec, 2020 11:18 IST|Sakshi

సాక్షి, విశాఖపట్న: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీ) ఆధ్వర్యంలో మదురవాడ న్యాయ కళాశాల పనొరమ హిల్స్‌ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, మంత్రి అవంతిశ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం జిల్లాలో సుమారు 25 కోట్ల మొక్కలు నాటాలని ఆదేశించారని తెలిపారు. వాహనాలు, జనాభా పెరుగుదలతో గ్రీన్ బెల్ట్ తగ్గుతోందని, మొక్కలు నాటి గ్రీన్‌ బెల్ట్‌ను 2021 నాటికి పెంచుతామని తెలిపారు. విశాఖ రాజధాని ప్రాంతం ఏర్పాటు అవడంతో పట్టణాభివృద్ధికి ఈ మొక్కలు నాటడం ఎంతో అవసరమని ఆయన గుర్తు చేశారు.

అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి చెట్లు నరకాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో సుమారు 1000 పార్కులో మొక్కలు నాటాలని, ఫెన్సింగ్‌ వేయాలని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరు వైపుల మొక్కలు నాటితే బడ్డీల పేరుతో ఆక్రమణలు జరగవని తెలిపారు.

మరిన్ని వార్తలు