ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ముద్రగడ పద్మనాభం లేఖ.. చురకలు

30 Mar, 2022 10:48 IST|Sakshi

Mudragada Padmanabham Letter, సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖలో రాధాకృష్ణకు పలు చురకలంటించారు. పేద పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల కోసమే తాను కాపు ఉద్యమం చేశానని ముద్రగడ తెలిపారు. లక్షాధికారిని కోటేశ్వరున్ని, కోటీశ్వరున్ని అపర కుబేరునిగా చేయడం కోసం కాదని స్పష్టం చేశారు. రాధాకృష్ణ ఆలోచనలను అమలు చేయడానికి తాను అసమర్థుడిని.. చేతకాని వాణ్ణి కాదని ముద్రగడ అన్నారు. రాధాకృష్ణలాగా.. ఎదుటి వాళ్లను ఏకవచనంతో మాట్లాడే పత్రిక యాజమానిని ఇంత వరకు చూడలేదన్నారు.

ఆంధ్రజ్యోతి యాజమాని కేఎల్‌ఎన్‌  ప్రసాద్‌ను కూర్చిలోంచి కాళ్లుపట్టుకొని లాగి.. ఆ కుర్చిలో కూర్చున్న ఘనత రాధాకృష్ణది అని విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఘన చరిత్ర ఏ కుల నాయకులకు ఉండదని దుయ్యబట్టారు. ‘‘నా చరిత్ర కంటే మీ చరిత్రను అందరూ చదవాలి. ఎందుకంటే మీలా  అపర కోటేశ్వరులు అవ్వలేరు. నోట్ల రద్దు సమయంలో నేలమాళిగలో దాచిన నల్లధనాన్ని బంగారు షాపుల యాజమానులను బెదిరించి ఏలా చలమణిలోకి తెచ్చారో? రెండు తలలు కలిసి పుట్టిన పిల్లలను విడదీయడానికి ఎలా డబ్బు సంపాదించాలో తెలిపే విధానాన్ని మీరు(రాధాకృష్ణను ఉద్దేశిస్తూ) ప్రజలకు చెప్పాలి. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెట్టింగ్‌లను ప్రోత్సహించి ఎలా కోట్లు సంపాదించింది కూడా నేర్పాలి అంటూ రాధాకృష్ణపై ముద్రగడ ఆ లేఖలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరిన్ని వార్తలు