ఒక్కో మొక్క రూ.25 లక్షలు!

26 Nov, 2021 16:03 IST|Sakshi

కడియం నుంచి కొనుగోలు చేసిన ముఖేశ్‌ అంబానీ సంస్థ

సాక్షి, కడియం: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ గుజరాత్‌లో అభివృద్ధి చేస్తున్న భారీ పార్కులో నాటేందుకు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి మొక్కలను తరలించారు. కడియంలోని వీరవరం రోడ్డులో మార్గాని వీరబాబుకు చెందిన గౌతమీ నర్సరీ నుంచి రెండు ఆలివ్‌ మొక్కలను గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాలీపై తీసుకువెళ్ళారు.

స్పెయిన్‌ నుంచి తీసుకువచ్చిన వీటి వయస్సు సుమారు 180 సంవత్సరాలు ఉంటుందని నర్సరీ రైతు మార్గాని వీరబాబు తెలిపారు. ఒక్కో మొక్క ధర రూ.25 లక్షలు ఉంటుందని సమాచారం. రెండేళ్ళ క్రితం ఇక్కడికి తెచ్చి, వాటిని అభివృద్ధి చేసినట్లు వీరబాబు వివరించారు. (చదవండి: సత్తా చాటిన విశాఖ; హైదరాబాద్‌ను వెనక్కునెట్టిన సుందరనగరి)

మరిన్ని వార్తలు