రాష్ట్ర ప్రాజెక్టులు భేష్: నాబార్డు చైర్మన్‌

19 Mar, 2021 03:42 IST|Sakshi
నాబార్డు చైర్మన్‌ జీఆర్‌ చింతలకు జ్ఞాపికను అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

అన్ని రకాలుగా సహకారం అందిస్తాం 

నాబార్డు చైర్మన్‌ జీఆర్‌ చింతల 

నవరత్నాల సీఎం వైఎస్‌ జగన్‌

కీలక రంగాల్లో మార్పులు.. 15 ఏళ్లలో పూర్తిగా మారనున్న రాష్ట్రం

ప్రజలకు అందుబాటులో మంచి చదువు, మంచి వైద్యం 

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మేం చాలా ఆసక్తిగా ఉన్నాం

నాబార్డు చైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఉండడం గర్వకారణం: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపడు తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ చాలా బావున్నాయని, ఈ ప్రాజెక్టులపై తాము చాలా ఆసక్తిగా ఉన్నామని నాబార్డు చైర్మన్‌ జీఆర్‌ చింతల స్పష్టం చేశారు. కీలక రంగాల్లో మార్పులు తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ తపనతో ఉన్నారని, ఆయన నవరత్నాల సీఎం అని ప్రశంసించారు. ముఖ్యమంత్రితో అనేక అంశాలపై చర్చించానని, సీఎం చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాల వల్ల వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రం పూర్తిగా మారబోతోందని తెలిపారు. మంచి చదువు, మంచి వైద్యం ప్రజలకు అందు తాయన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా నాబార్డు ఆర్థిక సాయంతో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం  సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు రాష్ట్రంలో విద్య, వైద్య రంగంతో పాటు ఇతర రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించి.. ఆర్థిక సాయం అందించాలని కోరారు.

దీనిపై నా బార్డు చైర్మన్‌ స్పందిస్తూ.. వీటిని పరిశీలించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చాలా ముఖ్యమైన రంగం అని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉం దని, ఈ రంగంలో తాము ఏరకంగా సహా య పడగలమో ఆలోచిస్తామని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నాబార్డు చైర్మన్‌గా తెలుగు వ్యక్తి ఉండడం గర్వకారణం అంటూ జీఆర్‌ చింతలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సన్మానించారు. అధికారులు నాబార్డ్‌ చైర్మన్‌కు విన్నవించిన అంశాలు ఇలా ఉన్నాయి.   

ఈ రంగాలకు రుణ సాయం అందించండి
► ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కింద 10 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం. తొలివిడతలో నాడు– నేడు కింద స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు రూ.652 కోట్లు ఇచ్చింది. మిగిలిన స్కూళ్లలో  పనుల కోసం మరో రూ.2 వేల కోట్లు ఇవ్వాలి.  
► వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ పేరుతో అంగన్‌వాడీ కేంద్రాల్లో సమూల మార్పులు తీసుకువస్తున్నాం.  ప్రజారోగ్య రంగంలో కూడా నాడు– నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నాం. వీటికి తగిన విధంగా రుణ సహాయం అందించాలి.
► వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆర్బీకేలు, మల్టీపర్పస్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానాలు, జనతా బజార్లను తీసుకొస్తున్నాం. ప్రజలకు రక్షిత తాగునీటిని అందించడానికి  వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు చేపట్టాం. వీటన్నింటికీ సహకరించాలి. 
► ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు