Nagarjuna: జగన్‌తో ‘చిరు’ భేటీ తెలుగు సినిమాకు మేలు

19 Jan, 2022 03:35 IST|Sakshi
మాట్లాడుతున్న నాగార్జున, చిత్రంలో ఆర్‌.నారాయణమూర్తి, మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్‌

బంగార్రాజు బ్లాక్‌బస్టర్‌ మీట్‌లో అక్కినేని నాగార్జున 

రాజమహేంద్రవరం రూరల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఏం మాట్లాడారని చిరంజీవిని అడగ్గా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని తెలిపారని అక్కినేని నాగార్జున చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన బంగార్రాజు సినిమా బ్లాక్‌బస్టర్‌ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. కోవిడ్‌ నేపథ్యంలో నార్త్‌ ఇండియాలో సినిమాలను ఆపేస్తే కేవలం తెలుగు ప్రేక్షకుల మీద నమ్మకంతోనే బంగార్రాజు సినిమాను రిలీజ్‌ చేసినట్లు చెప్పారు. కోవిడ్‌ ఆంక్షలను వాయిదా వేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి థాంక్యూ వెరీమచ్‌ అన్నారు.

బంగార్రాజు అచ్చమైన పంచెకట్టు తెలుగు సినిమా అని చెప్పారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు తన తండ్రి మంచి హిట్‌ ఇచ్చారన్నారు. దర్శకుడు కళ్యాణకృష్ణ మాట్లాడుతూ బంగార్రాజు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను రాజమహేంద్రవరంలో చేయాల్సి ఉందని, కానీ బ్లాక్‌బస్టర్‌ మీట్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. హీరోయిన్‌ కృతిశెట్టి మాట్లాడుతూ సర్పంచ్‌ నాగలక్ష్మి పాత్ర బాగా నచ్చిందా అని అభిమానుల్ని అడిగారు.

నటుడు ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీ నుంచి అమలు చేయాల్సిన కోవిడ్‌ ఆంక్షలను సంక్రాంతి పండుగ సందర్భంగా 18వ తేదీ నుంచి అమలు చేయడం వల్ల బంగార్రాజు సూపర్‌హిట్‌ అయిందన్నారు. వ్యవసాయ శాఖమంత్రి కె.కన్నబాబు మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతికి అసలైన్‌ కలర్‌ను బంగార్రాజు చిత్రం ద్వారా తీసుకువచ్చారన్నారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ తాను నాగార్జున స్టైల్స్‌ ఫాలో అయ్యేవాడినని చెప్పారు.  

మరిన్ని వార్తలు