పదవి భార్యది.. సర్పంచ్‌ కుర్చీ భర్తది!

6 Apr, 2021 03:59 IST|Sakshi
పెదకాకానిలో సర్పంచ్‌ మాధవీలత కుర్చీలో కూర్చున్న ఆమె భర్త నాగేశ్వరరావు 

పెదకాకాని (పొన్నూరు): గుంటూరు జిల్లా పెదకాకాని సర్పంచ్‌ మండే మాధవీలతకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని ఆమె భర్త నాగేశ్వరరావు పెత్తనం చెలాయిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా సమావేశంలో డీపీవో కేశవరెడ్డి మాట్లాడుతూ.. మహిళలు గెలుపొందిన పంచాయతీల్లో వాళ్లే సర్పంచ్‌ స్థానాల్లో కూర్చోవాలని.. ఎట్టిపరిస్థితిలోనూ వాళ్ల భర్తలకు పెత్తనం ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శులకు స్పష్టంగా చెప్పారు.

అయితే అధికారుల ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయకుండా పెదకాకాని పంచాయతీలో మహిళా సర్పంచ్‌ అధికారాన్ని ఆమె భర్త లాక్కోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు