ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు: వాళ్లే ఎన్టీఆర్‌కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి 

28 May, 2023 11:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలోని ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌, దేవినేని నెహ్రూ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి లక్ష్మీపార్వతి, డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ, కొడాలి నాని, పేర్నినాని హాజరయ్యారు. 

ఈ సందర్బంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడి పోరాడి అలసిపోయాను. నా ఆవేదనను ఒక్కరు కూడా పట్టించుకోలేదు.  ఎన్టీఆర్‌ వారసులమంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారు. కుడుపున పుడితే వారసులు కాదు. ఎన్టీఆర్‌కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు. ఎన్టీఆర్‌కు చివరి క్షణాల్లో అండగా ఉంది దేవినేని నెహ్రూ మాత్రమే. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు. 

మాట్లాడటం కూడా రాని లోకేష్ కూడా నేనే వారసుడినంటున్నాడు.  ఎన్టీఆర్‌ను మోసం చేసిన ఈ  దుర్మార్గులు ఎలా వారసులు అవుతారు. చంద్రబాబు అంత నీచుడు మరొకడు లేడు. చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీఆర్‌ ఎంతో బాధపడ్డారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించాడు. ఎన్టీఆర్‌ పేరు కానీ.. ఫొటో కానీ.. పెట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదు. ఎన్టీఆర్‌ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు. 

ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను.   క్లిష్టసమయంలో డైరెక్టర్‌ రాం గోపాల్‌వర్మ నాకు ధైర్యానిచ్చారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాతో నా పాత్ర గురించి అందరికీ చెప్పారు. నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినపుడు నాకు పోసాని కృష్ణమురళీ ఓ సోదరుడిగా అండగా నిలిచారు  అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: చంద్రబాబు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు: లక్ష్మీపార్వతి

మరిన్ని వార్తలు