రూ.కోటితో విఘ్నేశ్వరుడు ధగధగ

10 Sep, 2022 12:18 IST|Sakshi

సాక్షి, నందిగామ: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలోని వాసవి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు కోటి రూపాయల కరెన్సీ నోట్లతో భక్తులకు దర్శనమిచ్చారు. వాసవి మార్కెట్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితికి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రోజుకొక అలంకరణతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం గణనాథుడితో పాటు మండపాన్ని సైతం కరెన్సీ నోట్లతో అలంకరించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.   

చదవండి: (చరిత్రలో తొలిసారి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం)

మరిన్ని వార్తలు