చంద్రబాబుకి రెస్ట్‌.. కుప్పం బరిలో నారా భువనేశ్వరి?

21 Feb, 2024 14:19 IST|Sakshi

కుప్పానికి చంద్రబాబు గుడ్‌బై

నేను పోటీ చేయాలనుకుంటున్నానని ప్రకటించిన భువనేశ్వరీ

చంద్రబాబుకు రెస్ట్‌ ఇద్దామనుకుంటున్నాం : భువనేశ్వరీ

ఓడిపోతారనే పారిపోతున్నారు : YSRCP

చంద్రబాబు డైరెక్షన్‌.. భువనేశ్వరీ యాక్షన్‌

సాక్షి, చిత్తూరు: కుప్పం నుంచి పారిపోయే యోచనలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్లలో సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారాయన. కనీసం మంచినీళ్లు కూడా అందించలేకపోయారు.  అయితే వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక.. తన మన పార్టీ భేదాలు లేకుండా  అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఓ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేద్దామనుకుంటున్నానని బహిరంగ సభలో ప్రకటించారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం రూపురేఖల్ని మార్చేశారు, భారీగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది. తాజాగా.. ఆయన సతీమణి నారా  భువనేశ్వరి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. కుప్పం నుంచి పోటీకి ఆసక్తికనబరుస్తూ నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో 35 ఏళ్ల నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు రెస్ట్‌ ఇచ్చి.. తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారామె. 

బహిరంగ సభలో భువనేశ్వరీ ఏమన్నారంటే.. 

"కుప్పంకు వచ్చాను.. ఇక్కడ నాకొక కోరిక ఉంది
నా మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది
(సభకు వచ్చిన వారిని ఉద్దేశిస్తూ..)
నేనేమి మిమ్మల్ని కొట్టను.. తిట్టను
35ఏళ్లుగా చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాడు
ఇప్పుడు నాకొక కోరిక ఉంది
ఆయన్ను రెస్ట్‌ తీసుకోమని చెబుతున్నా
నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా"

చంద్రబాబు అస్త్ర సన్యాసం.!?

భువనేశ్వరీ చేసిన ప్రకటన రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రకటనగా చూడాలి. చాలా కాలంగా చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. సరిగా ఎన్నికలకు రెండు నెలల ముందు భార్య భువనేశ్వరీతో ప్రకటన చేయించాడని భావిస్తున్నారు. పైగా భువనేశ్వరీ మాటల్లో స్పష్టంగా ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు విశ్రాంతి కావాలని చెబుతున్నారు. చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో రోగాలున్నాయని కోర్టుకు నివేదిక రూపంలో ఇచ్చారు. అసలే అనారోగ్యం.. ఆపై వయస్సు మీద పడడం.. చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. వృద్ధాప్యం పెరగడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొడుకు లోకేష్‌ను ఎంత ఎంకరేజ్‌ చేసినా.. ఫలితం లేకపోవడంతో రాజకీయాల నుంచే తప్పుకోవడం మేలని టిడిపిలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

చంద్రబాబు తప్పుకోవడానికి కారణమేంటీ?

 • కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలున్నాయి. నాలుగు చోట్ల YSRCP గెలిచింది
 • కుప్పం నగర పంచాయతీలో వైఎస్సార్‌సిపి ఘనవిజయం సాధించింది
 • కుప్పం మండలంలోని 29 పంచాయతీల్లో 25 చోట్ల YSRCP గెలిచింది
 • కుప్పంలో వరుస ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా తప్పుకోవడం మేలని భావిస్తున్నారు
 • కుప్పం పట్టణాన్ని చంద్రబాబు హయాంలో మున్సిపాలిటీ చేయలేదు. 2019 తర్వాత సీఎం జగన్‌ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అయింది
 • కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేయాలన్న డిమాండ్‌ను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. గత ఏడాది సీఎం జగన్‌ వచ్చిన తర్వాత రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు
 • కుప్పంలో తాగునీటి సమస్యకు చంద్రబాబు పరిష్కారం చూపించలేదు. ఈ పనులను సీఎం జగన్‌ పూర్తి చేయించి ఈ నెలలో పరిష్కారం కల్పిస్తున్నారు
 • కుప్పంలో దొంగ ఓట్ల తొలగింపు అత్యంత కీలకమైన విషయం. ఏకంగా 30వేల దొంగ ఓట్లు ఉన్నట్టు వైఎస్సార్‌సిపి ఫిర్యాదు చేసింది. వీటిని ఎన్నికల సంఘం తొలగించడంతో టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.
 • అత్యంత ప్రతికూలతలున్న ప్రస్తుత సమయంలో తాను పోటీ చేసి ఓడిపోవడం సరికాదన్న ఆలోచనలో బాబు ఉన్నారు

భరత్‌, కుప్పం YSRCP ఇన్‌ఛార్జ్‌

"అన్ని స్థానిక సంస్థల్లో YSRCP విజయం సాధించింది. తాజా సర్వేల్లో ఓడిపోతానని చంద్రబాబుకు అర్థమయింది. ఎలాగూ ఓడిపోతానని తేలిపోవడంతో చంద్రబాబు పలాయనవాదం ఎంచుకున్నట్టుంది. అందుకే భువనేశ్వరీతో ఎన్నికల ముందు ఈ ప్రకటన చేయించాడు. చంద్రబాబు హయాంలో కుప్పంలో పార్టీ వివక్ష వీపరీతంగా సాగింది. టిడిపికి చెందిన వాళ్లకు మాత్రమే పనులు జరిగాయి. 2019 తర్వాత ప్రజలు స్పష్టమైన మార్పు చూస్తున్నారు. అర్హులైన వారు ఏ పార్టీ అయినా సంక్షేమం అందింది. జగన్‌ రూపంలో గొప్ప నాయకత్వాన్ని చూశారు. ఓటమి కళ్ల ముందు కనబడడంతో చంద్రబాబు ముందే కుప్పం నుంచి పారిపోతున్నారు."

చంద్రబాబు కింకర్తవ్యం.!?

చంద్రబాబు గత కొన్నాళ్లుగా పెనమలూరు నియోజకవర్గంపై కన్నేశారు. కుప్పంలో ఎలాగూ గెలవలేను కాబట్టి .. తన సామాజిక వర్గం అంటే కమ్మ ఓటర్లు అత్యధికంగా ఉన్న పెనమలూరు అయితే తనకు సేఫ్‌ అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తొలుత విశాఖ అనుకున్నా.. అక్కడ గెలిచే అవకాశం లేదని పార్టీ సర్వేల్లో తేలింది. దీంతో కుప్పంను వదిలిపెట్టి పెనమలూరులో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు చంద్రబాబు. 2019లో పెనమలూరులో వైఎస్సార్‌సిపి ఘనవిజయం సాధించింది. ఇక్కడ గెలిచిన పార్థసారథిని తెర వెనక ఏం చేశారో కానీ తనవైపునకు తిప్పుకున్నారు చంద్రబాబు.

భువనేశ్వరీ ప్రకటనను ఎలా చూడాలి?

 • భువనేశ్వరీ ప్రకటన సరదా కామెంట్‌ కాదు
 • భువనేశ్వరీ ఏ సభలో ఎలా మాట్లాడాలి అన్నది పక్కగా స్క్రిప్టింగ్‌ చేస్తారు
 • ముందే ఏం చేయాలి.? ఎలా ప్రకటనలు చేయాలి అన్నదానిపై శిక్షణ ఇస్తారు
 • కార్పోరేట్‌లో ఉండడం వేరు, ప్రజల్లోకి రావడం వేరు కాబట్టి భువనేశ్వరీ విషయంలో పార్టీ అంత జాగ్రత్త తీసుకుంటారు
 • శిక్షణ కోసమే నిజం గెలవాలి యాత్రను వెంట వెంటనే కాకుండా.. బ్రేకులిస్తూ తీసుకెళ్తున్నారు
 • అంటే భువనేశ్వరీ మాట్లాడే ప్రతీ మాటకు చంద్రబాబు డైరెక్షన్‌ ఉంటుంది
 • చంద్రబాబు ఒక విషయాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి చేసిన ప్రయత్నం ఇది
 • కుప్పంలో పోటీ చేసి చంద్రబాబు ఓడిపోతే.. అసలుకే మోసం వస్తుందన్న భయం
 • కుప్పం సేఫ్‌ సీటు కాదు కాబట్టి ముందే భార్యతో చెప్పించడం
 • రెండు నియోజకవర్గాలు అనుకున్నా.. రెండింటా ఓడిపోతే ఎలా అన్న భయాలు
 • తెలంగాణలోనూ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అందరూ ఓడిపోయారు (ఈటల రెండు చోట్లు, రేవంత్‌, కేసిఆర్‌ ఒక్కో చోట)
 • చంద్రబాబు కుప్పంలో పోటీ చేయలేనప్పుడు పార్టీని ఏం నడిపిస్తాడు?
 • భువనేశ్వరీ ద్వారా చంద్రబాబే ఒక ఫీలర్‌ వదిలారు
 • ముందుగా భువనేశ్వరీతో చెప్పించి, ఆ తర్వాత ఓ పార్టీ ప్రకటన చేయించే ఆలోచన చంద్రబాబుది
 • ఇప్పటికీ పొత్తులపైనే నమ్మకం తప్ప.. ఇది చేస్తానని, ఇది చేశానని బలంగా చెప్పుకోలేని చంద్రబాబుకు రిటైర్మెంట్‌ టైం వచ్చింది
 • భువనేశ్వరీ ప్రకటన చూస్తుంటే ఇది చంద్రబాబు అస్త్ర సన్యాసమే

whatsapp channel

మరిన్ని వార్తలు