AP Legislative Council: మైనారిటీ ఎమ్మెల్సీ రుహుల్లాను అవమానించిన లోకేష్‌

21 Mar, 2022 13:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో మైనారిటీ ఎమ్మెల్సీ రుహుల్లాను నారా లోకేష్‌ అవమానించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ రుహుల్లా ప్రమాణాన్ని టీడీపీ అడ్డుకుంది. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకార ప్రసంగం వినపడకుండా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. మైనారిటీ ఎమ్మెల్సీని ప్రమాణం చేయనివ్వాలని వైఎస్సార్‌సీపీ కోరగా, అయితే ఏంటి.. మైనారిటీ ఎమ్మెల్సీ అని మాకు తెలుసులే అంటూ లోకేష్‌ వ్యాఖ్యానించారు. మైనారిటీ సభ్యుడిని అవమానించిన లోకేష్‌పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

చదవండి: ఏపీ అసెంబ్లీ: టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్‌ సీరియస్‌

 శాసన మండలిలో టీడీపీకి మంత్రి అనిల్‌ సవాల్‌
మండలిలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఛైర్మన్‌ వారిస్తున్నా వారు పట్టించుకోలేదు. పొత్తులు లేకుండా టీడీపీ ఎన్నికలకు వెళ్లగలదా? ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించగలరా అంటూ మంత్రి అనిల్‌ సవాల్‌ విసిరారు. 2024లో మేం ఒంటరిగా బరిలోకి దిగుతున్నామని.. ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా అంటూ మంత్రి అనిల్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు