గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్ల కేటాయింపు 

18 Jan, 2023 19:05 IST|Sakshi

లక్ష్మీపురం(గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్‌ ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఆంజనేయులు మంగళవారం వెల్లడించారు. రైలు నంబర్‌ 07153 నరసాపూర్‌–యశ్వంత్‌పూర్‌ ప్రత్యేక రైలు ఈ నెల 18వ తేదీ ఉంటుందన్నారు. ఈ రైలు మధ్యాహ్నం 3.10 గంటలకు నరసాపూర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 7.50 గంటలకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 

రైలు నంబర్‌ 07514 ప్రత్యేక రైలును (యశ్వంత్‌పూర్‌–నరసాపూర్‌) ఈ నెల 19న కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు యశ్వంత్‌పూర్‌ స్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి శుక్రవారం తెల్లవారుజాము 3.35 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 8.30 గంటలకు నరసాపూర్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 07156 యశ్వంత్‌పూర్‌–నరసాపూర్‌ రైలు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2.20 గంటలకు నరసాపూర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 6.25 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని, అక్కడ నుంచి శనివారం ఉదయం 10.30 గంటలకు యశ్వంత్‌పూర్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని వివరించారు. 

07517 యశ్వంత్‌పూర్‌–నరసాపూర్‌ రైలు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు యశ్వంతపూర్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి అదే రోజు ఉదయం 10.30 గంటలకు నరసాపూర్‌ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. 07046 సికింద్రాబాద్‌–దిబ్రూగ్రహ్‌ వయా గుంటూరు డివిజన్‌ మీదుగా ఫిబ్రవరి 2, 9, 16, 23వ తేదీల్లో ప్రత్యేక రైలును కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. 

ఈ రైలు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3.50 గంటలకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి శనివారం రాత్రి 8.50 గంటలకు దిబ్రూగ్రహ్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 07047 ప్రత్యేక రైలును ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు ఆదివారం రాత్రి 7.25 గంటలకు దిబ్రూగ్రహ్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి గుంటూరు రైల్వే స్టేషన్‌కు మంగళవారం రాత్రి 10.10 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. (క్లిక్ చేయండి: సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు.. ఎప్పటినుంచంటే..)

మరిన్ని వార్తలు