NATA: ఏపీకి 500 ఆక్సిజన్‌ కాన్సట్రేటర్స్‌ విరాళం

1 Jun, 2021 20:13 IST|Sakshi

న్యూజెర్సీ: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రెండు తెలగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు నాటా(నార్త్‌ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) ముందుకు వచ్చింది. ఈ మేరకు నాటా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రాఘవ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వైరస్‌ విజృంభిస్తుండటంతో ఆస్పత్రులన్ని కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్‌ బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ కాన్సట్రేటర్స్‌ ఉంటే.. కొందరు ఇంటి వద్దనే క్వారంటైన్‌లో ఉండి కోలుకోవచు​. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్‌ కాన్సట్రేటర్స్‌, పల్స్‌ ఆక్సిమీటర్లు, ఇతర వైద్య పరికరాలు అందించేందుకు ముందుకు వచ్చింది’’ అని రాఘవ రెడ్డి తన ప్రకటనలో తెలిపారు. 

నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ ఎమెరిటస్, ప్రైమ్‌ హెల్త్ కేర్‌ అధినేత డాక్టర్ ప్రేమ్ రెడ్డి  ఆంధ్రప్రదేశ్‌కు 500 ఆక్సిజన్‌ కాన్సట్రేటర్స్‌, అవసరమైన ఇతర వైద్య సామాగ్రిని విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రేమ్‌రెడ్డి ప్రైమ్ హాస్పిటల్‌కు దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 44 ఆస్పత్రులు , 300 ఔట్‌ పేషెంట్ల విభాగాలతో దేశంలో ఐదవ అతిపెద్ద లాభాపేక్షలేని ఆసుపత్రి వ్యవస్థగా నిలించింది. 

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీతో సహా వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా నాటా 250 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు విరాళంగా ఇచ్చింది. మే 31, 2021 న 85 రెసిజన్ కాన్సట్రేటర్స్‌, 1400 పల్స్ ఆక్సిమీటర్లను వివిధ జిల్లాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తమకు సాయం చేసిన డాక్టర్ అరుమల్లా శ్రీధర్ రెడ్డికి, ఏపీ స్టేట్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి కాకుండా నాటా 165 ఆక్సిజన్ కాన్సన్‌ట్రెటర్స్‌, అదనంగా వెయ్యి పల్స్ ఆక్సిమీటర్లు, ఇతర వైద్య సామాగ్రిని సేకరించి అవసరమున్న కోవిడ్‌ బాధితులకు అందజేసింది. 

ఇవే కాక మృతదేహాల దహన సంస్కారాలు, కోవిడ్ ప్రభావంతో ఉన్న కుటుంబాలకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో సహాయపడే వివిధ అనాథాశ్రమాలు , సంస్థలకు సహాయం చేయడానికి నాటా ప్రయత్నిస్తోంది.

చదవండి: ఇండియా సోషల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఔదార్యం..

మరిన్ని వార్తలు