కరోనా చికిత్సలో వాడే మందులు ఫ్రీగా ఇస్తాం: నాట్కో ఫార్మా

21 May, 2021 22:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ –19 చికిత్సలో వాడే మందులను నాట్కో ట్రస్టు తరపున ఉచితంగా అందిస్తామని సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నాట్కో ఫార్మా సంస్థ లేఖ రాసింది.  కోవిడ్‌ చికిత్సలో వాడే బారిసిటినిబ్‌–4 ఎంజీ (బారినట్‌) టాబ్లెట్స్‌ ఉచితంగా ఇవ్వనున్నట్టు ఆ లేఖలో  నాట్కో ట్రస్ట్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. సుమారు లక్ష మంది కోవిడ్‌ పేషెంట్లకు ఈ టాబ్లెట్లు సరఫరా చేయనున్నట్టు వారు తెలిపారు. రూ. 4 కోట్ల 20 లక్షలు ఖరీదు చేసే టాబ్లెట్స్‌ను ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య సంస్థల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లకు ఇవ్వనున్నట్టు తెలిపారు. విడతల వారీగా రానున్న కొద్ది వారాల్లో ఈ మెడిసిన్‌ సరఫరా చేయనున్నట్టు నాట్కో ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ వీ.సీ నన్నపనేని స్పష్టం చేశారు. 

చదవండి: ప్రాణం విలువ తెలిసిన వాడిని: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు