సీబీఐ అధికారి పెద్దిరాజుకు జాతీయ అవార్డు

3 Apr, 2022 10:43 IST|Sakshi

పాలకోడేరు: న్యూఢిల్లీ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రధాన కార్యాలయం సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డివిజన్‌లో పనిచేస్తున్న డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ బండి పెద్దిరాజు 2019 సంవత్సరానికి ‘కేంద్ర హోంమంత్రి మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌’ పురస్కారానికి ఎంపికయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చేతులమీదుగా సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ సమక్షంలో శనివారం న్యూఢిల్లీ విజ్ఞాన భవన్‌లో జరిగిన ఆల్‌ ఇండియా సీబీఐ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్స్‌ సమావేశంలో అవార్డును అందుకున్నారు.

పెద్దిరాజు పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం (బంటుమిల్లి) గ్రామానికి చెందినవారు. ఆయన 1993లో సీబీఐలో కానిస్టేబుల్‌గా చేరారు. 2008లో ఇండియా ఉత్తమ దర్యాప్తు అధికారి గోల్డ్‌ మెడల్,  2017లో ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌–ఐపీఎం,  2014–2018లో రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు, 2019లో డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఎక్స్‌లెన్స్‌ అవార్డు పొందారు. 

మరిన్ని వార్తలు