జాతీయ స్థాయిలో ఏపీకి అవార్డులు

19 Nov, 2020 17:14 IST|Sakshi

 అవార్డులు ప్రదానం చేసిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

సాక్షి, విజయవాడ: జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ అవార్డులు దక్కించుకుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవార్డులను ప్రకటించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏపీలో చేపట్టిన కార్యక్రమాలకు ఈ అవార్డులు వరించాయి. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్‌)

ఓడిఎఫ్, జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్, నూతన టెక్నాలజీలకు అవార్డులు దక్కాయి. తూర్పు, పశ్చిమ గోదావరి కలెక్టర్లకు అవార్డులను కేంద్ర మంత్రి షెకావత్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో నిర్వహణ సులభతరమైందని పేర్కొన్నారు. (చదవండి: ‘అప్పుడాయన ఎక్కడున్నారు..?’)

విశాఖ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ..
విశాఖ: అంతర్జాతీయ పోటీల్లో విశాఖ నగరం మూడో స్థానంలో నిలవడం శుభపరిణామం అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు.. ప్రజలు సహకరించటంతోనే విశాఖ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అన్ని పార్టీల ప్రజలు ఉన్నారని తెలిపారు. చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగా ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకున్నా.. సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం పేదల విషయంలో రాజీ పడలేదన్నారు. ఇళ్ల పట్టాలు తీసుకోబోతున్న వ్యక్తుల్లో టీడీపీ సానుభూతి పరులు కూడా ఉన్నారని అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు