నేటి నుంచి జాతీయ చెస్‌ పోటీలు

1 Oct, 2023 06:18 IST|Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: జాతీయ అండర్‌–11 చెస్‌ చాంపియన్‌షిప్‌ ఆదివారం విశాఖ పోర్ట్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆంధ్ర చెస్‌ సంఘం, ఆల్‌ విశాఖ చెస్‌ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన ఫిడే రేటింగ్‌ చిన్నారులు పోటీపడనున్నారు. పదకొండు రౌండ్ల పాటు సాగే ఈ పోటీలు 7వ తేదీతో ముగుస్తాయని ఆంధ్ర చెస్‌ సంఘం అధ్యక్షుడు కె.వి.వి.శర్మ తెలిపారు.

విజేతకు రూ.70 వేల ప్రోత్సాహకం అందించనుండగా ఏడు నుంచి ఇరవై స్థానాల్లో నిలిచిన బాల బాలికలకు సైతం రూ.పదేసి వేల ప్రోత్సాహకం అందించనున్నామన్నారు. 386 మంది అండర్‌ 11 బాలబాలికలు పోటీ పడుతున్నారు. టోర్నీ టాప్‌ రేటింగ్‌తో కర్ణాటకకు చెందిన అపార్‌ పోటీ పడుతుండగా ఏపీ తరఫున అందాలమాల 17వ ర్యాంక్‌తో ఎత్తులు ప్రారంభించనున్నారు.   

మరిన్ని వార్తలు