కాలనీలపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి  

17 Aug, 2022 15:56 IST|Sakshi
20వ డివిజన్లో పర్యటిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో నానాటికీ విస్తరిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. 20వ డివిజన్లోని ఇస్కాన్‌ సిటీలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో రోడ్డు సమస్యను ఆయనకు స్థానికులు తెలియజేశారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణానికి మేయర్‌ స్రవంతితో కలిసి శంకుస్థాపనను చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు.

శివారు ప్రాంతాల అభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పారు. ఆయా కాలనీల అభివృద్ధికి కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్‌ మహేష్, నేతలు శ్రీనివాసరావు, మల్లికార్జున్‌యాదవ్, ఖాదర్‌బాషా, రమణయ్య, రవి,  వెంకటరమణయ్య, విఠల్, డేవిడ్‌రాజు, కవిత, తదితరులు పాల్గొన్నారు. 
చదవండి: ఎంపీడీఓల కల నెరవేరిన వేళ.. కొత్త పోస్టుల్లో చేరిక

మరిన్ని వార్తలు