12 పంచాయతీలు, 725 వార్డులకు కొత్త నోటిఫికేషన్

3 Mar, 2021 11:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికలు జరగని పంచాయతీలు, వార్డులకు కొత్త నోటిఫికేషన్‌ విడుదలైంది. సాంకేతిక కారణాలు, నామినేషన్లు దాఖలు కాని 12 పంచాయతీలు, 725 వార్డులకు బుధవారం ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసింది. వార్డులు, గ్రామాల వారీగా ఈనెల 4వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రదర్శన జరగనుంది. 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు.. 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.. 8వ తేదీ సా.5 గంటల వరకు నామినేష‌న్లపై ఫిర్యాదుల స్వీకరణ..

9వ తేదీ నామినేషన్లపై వచ్చిన అప్పీల్ పరిశీలన.. 10 వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం 4 గంటలకి అభ్యర్ధుల తుది జాబితా విడుదల కానుంది.  13వ తేదీ రాత్రి 7.30 గంటలతో అభ్యర్ధుల ప్రచారం ముగియనుంది. 15వ తేదీ ఉ.6.30 నుంచి మ.3.30 గంటల వరకు పోలింగ్.. సాయంత్ర 4 గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు