విశాఖలో ఒక్క రోజులో 1.26 లక్షల డౌన్‌లోడ్స్‌

19 May, 2022 04:24 IST|Sakshi
ఎన్‌ఏడీ జంక్షన్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్న పోలీసులు

దిశ యాప్‌ డౌన్‌లోడ్స్‌లలో రాష్ట్రంలోనే సరికొత్త రికార్డు

పెదవాల్తేరు (విశాఖతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో అమలు చేస్తున్న దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ల విషయంలో సరికొత్త ఘనత సాధించింది. నగరంలో బుధవారం ఒక్కరోజే 1.26 లక్షల మంది మొబైల్‌ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ విధంగా డౌన్‌లోడ్‌ల విషయంలో విశాఖ నగరం రాష్ట్రంలోనే   ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

దిశ పోలీసులు, వార్డు వలంటీర్లు, మహిళా పోలీసులు వారి పరిధిలోని మహిళలు, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ వారి మొబైల్‌ ఫోన్‌లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, దిశ పోలీసులను నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ అభినందించారు.   

మరిన్ని వార్తలు