కొత్తగా 16 వైద్య కళాశాలలు

22 Sep, 2020 04:48 IST|Sakshi
సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఆళ్ల నాని

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని 

సీతంపేట/పార్వతీపురం టౌన్‌: రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు, మరో 16 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) తెలిపారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో, విజయనగరం జిల్లా పార్వతీపురంలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి స్థలాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. 

► రాష్ట్రంలో అన్ని ఐటీడీఏల పరిధిలో 6 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. నిరుపేదలకు కిడ్నీ, గుండెపోటు వంటి జబ్బులొస్తే విశాఖ, విజయవాడ, గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి మారుతుంది. 
► రూ.16 వేల కోట్లు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా నాడు–నేడు, నవరత్నాల కార్యక్రమంలో భాగంగా అన్ని స్థాయిల్లో ఉన్న ఆస్పత్రులను ఆధునికీకరిస్తున్నాం.  
► కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పాముల పుష్పశ్రీవాణి, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు