సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నూతన రాజ్యసభ సభ్యులు

3 Jun, 2022 19:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌రెడ్డి నూతన ఎంపీలుగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి నుంచి డిక్లరేషన్‌ తీసుకున్నారు. అనంతరం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన నూతన రాజ్యసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

చదవండి: (ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం)

మరిన్ని వార్తలు