AP: ఏ  సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు

19 Jul, 2022 12:51 IST|Sakshi

తాడేపల్లి: అందరికీ సంక్షేమంలో భాగంగా..  ఏపీలో మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కల్గింది. సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి అందని వారికి తాజాగా రూ. 137 కోట్ల నిధులను విడుదుల చేసింది సీఎం జగన్‌ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా తమకు అందుతున్న సంక్షేమ పథకాలు, సీఎం జగన్‌ పాలనపై పలువురి లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది లబ్ధిదారులు తాము పొందుతున్న లబ్ధిని సీఎం జగన్‌కు వివరించారు.

ఏ  సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు
మాలాంటి వాళ్ల కోసం ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందు ఇలాంటి ఆలోచన చేయలేదు. మొదటిసారిగా మీరు చేశారు. మీరు ఈబీసీ పథకం కోసం డిసెంబర్‌లో అప్లై చేశాను. కానీ నా ఆధార్‌ కార్డు లింక్‌ అప్‌ కాలేదు. ఆధార్‌ కార్డు లింక్‌ అప్‌ చేసుకుని ఆ పథకం ద్వారా లబ్ధి చేకూరడం ఆనందంగా ఉంది. మా పెద్ద  అమ్మాయికి విద్యా దీవెన, వసతి దీవెన అందుతోంది. మా చిన్నమ్మాయికి అమ్మ ఒడి పథకం అందుతోంది. దాంతో నా పిల్లల్ని ఆనందంగా చదివించుకుంటున్నా. నాకు విడో పెన్షన్‌ అందుతోంది. మీరిచ్చిన భరోసాతో నా కుటుంబం ఆనందంగా బ్రతక గల్గుతోంది.అందరి పేద జీవితాల్లో వెలుగులు నింపుతున్నార్‌ సార్‌. 
మామిడిపాటి లక్ష్మి, శ్రీకాకుళం జిల్లా

ఓసీలకు కూడా పథకాల్ని వర్తింపచేసిన ఏకైక సీఎం మీరే అన్నా
జగనన్న తోడు ద్వారా రెండు విడతలుగా 10 వేల చొప్పున పొందాను. డ్వాక్రా మహిళా సంఘంలో కూడా ఉన్నాను.దాని ద్వారా లబ్ది పొందుతున్నాను.మా అత్త గారికి వితంతు పించన్‌ వస్తుందన్నా. మీ నాన్నగారు వైఎస్సార్‌ ఉన్నప్పుడు ఇంటి పట్టాను పొందాము. వైఎస్సార్‌ ఆసరా కూడా మా కుటుంబానికి అందుతుందన్నా. పార్టీలకతీతంగా పథకాల్ని వర్తింపు చేస్తున్న మీకు ధన్యవాదాలు అన్నా. ఓసీలకు కూడా పథకాల్ని వర్తింప చేసిన ఏకైక సీఎం మీరే అన్నా.
జ్యోతి, అనంతపురం జిల్లా

మీలాంటి నాయకుడ్ని ఇంతకముందు చూడలేదు
మీరు పాదయాత్రలో మత్యకారులు వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసా కింద రూ. 10 వేలు సాయం అందిస్తానన్నారు. ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా బాధలు గుర్తించి వేట నిషేధ కాలంలో మాకు సాయం అందిస్తున్నారు. మత్యకార భరసా, అమ్మ ఒడి, జగనన్న చేయూత ఇలా నాకు రూ. 70 వేల భరోసా అందుతుందన్నా. నా ఒక్కడికే 70 వేల రూపాయలు అందితే కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకార కుటుంబాల్ని ఇంకా ఎంతమందిని ఆదుకున్నారో అన్నా మీరు. మీలాంటి నాయకుడ్ని ఇంతకుమందు చూడలేదన్నా. మీరు మా పట్ల చూపించిన అభిమానం గొప్పగా అనిపిస్తుందన్నా
ఉడిపి సైమన్‌, కాకినాడ జిల్లా

మరిన్ని వార్తలు