రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ విచారణ

16 Aug, 2021 14:55 IST|Sakshi

 న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పర్యావరణ ఉల్లంఘనలు, ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నివేదిక నిబంధనల ప్రకారం దాఖలు చేయాలని ఎన్జీటీ వెల్లడించింది. ఆగస్టు 27కల్లా నివేదిక దాఖలు చేయాలని కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. 

కేఆర్ఎంబీ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత తదుపరి ఉత్తర్వులు ఇస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది. అయితే జులై 7వ తేదీనే పనులు నిలిపివేసినట్టు ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపింది. కేఆర్ఎంబీ నివేదికపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏపీ న్యాయవాదులకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం సూచించింది.

మరిన్ని వార్తలు