ఏపీ అభ్యంతరాలపై కృష్ణా బోర్డు వివరణ కోరిన ఎన్జీటీ

4 Aug, 2021 15:11 IST|Sakshi

సాక్షి, చెన్నై/ అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌(ఎన్జీటీ) బుధవారం విచారణ చేపట్టింది. ప్రాజెక్ట్ తనిఖీ బృందంలో తెలంగాణ స్థానికత ఉన్న సీడబ్ల్యూసీ అధికారిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

అయితే ఈ ఆంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్‌పర్ట్‌ మెంబర్ డాక్టర్ సత్యగోపాల్‌తో కూడిన ఎన్జీటీ చెన్నై బెంచ్ ఏపీ అభ్యంతరాలపై కృష్ణా బోర్డు వివరణ కోరింది. దీంతో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా తనిఖీకి వెళ్లేందుకు సిద్ధమని కృష్ణా బోర్డు పేర్కొంది. ఈనెల 9న నివేదిక అందజేయాలని ఎన్జీటీ కృష్ణా బోర్డును ఆదేశించింది. 

మరిన్ని వార్తలు