ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులు చేపట్టిన ఎన్‌హెచ్‌ఏఐ

9 May, 2021 20:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : నేషనల్‌ హైవే అథారిటీ ఆంధ్రప్రదేశ్‌లో 42 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు పనులను మొదలుపెట్టింది. ఆదివారం తొలివిడతగా 4 ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టింది. హిందూపురంలో 1000 ఎల్‌పీఎం సామర్థ్యంతో ప్లాంట్‌.. అమలాపురంలో 500 ఎల్‌పీఎం, మదనపల్లెలో 500 ఎల్‌పీఎం.. తాడేపల్లి గూడెంలో 1000 ఎల్‌పీఎం సామర్థ్యంతో ప్లాంట్ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే 3 ప్లాంట్ల నిర్మాణ పనులు చేపట్టింది. అధికారులు రేపు అమలాపురంలో ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. మిగిలిన 38 ప్లాంట్ల ఏర్పాటుకు కూడా స్థలాలు ఖరారయ్యారు. ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రుల వద్ద ప్లాంట్ల ఏర్పాటు జరగనుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు