తప్పులో కాలేసిన ‘నిమ్మగడ్డ’ 

26 Jan, 2021 05:40 IST|Sakshi
నిమ్మగడ్డ రమేష్‌కుమార్

ఫిబ్రవరి 10కి బదులు జనవరి 10వ తేదీతో సవరణ నోటిఫికేషన్‌  

ఎస్‌ఈసీ కార్యాలయ నుంచే ఓ వర్గం మీడియాకు లీక్‌ 

ఆ తర్వాత సోషల్‌ మీడియాలో హల్‌చల్‌.. అనంతరం తప్పును గుర్తించి దిద్దుబాటు 

సాక్షి, అమరావతి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ తప్పులో కాలేశారు. తప్పుల తడకగా తయారైన పంచాయతీ ఎన్నికల రీ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సోషల్‌ మీడియాలో సోమవారం వైరల్‌ అయిన ఈ విషయం కథాకమామిషు ఏమిటంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఈ నెల 23న విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈనెల 25వ తేదీ సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం.. తదితర కారణాలతో ఎక్కడా నామినేషన్ల ప్రక్రియ మొదలుకాలేదు.

ఈ నేపథ్యంలో.. రెండు, మూడు, నాలుగో విడతలో జరగాల్సిన ఎన్నికలను అదే తేదీలతో ఒకటవ, రెండో, మూడో విడతలుగానూ, తొలి విడతలో జరగాల్సిన ఎన్నికలను నాల్గవ విడతకు మారుస్తూ నిమ్మగడ్డ సవరణ నోటిఫికేషన్‌ జారీచేశారు. అయితే, ఈ నోటిఫికేషన్‌లో నాల్గవ విడత ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్ల ప్రక్రియ అని ఉండాల్సి ఉండగా.. జనవరి 10 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంటూ నోటిఫికేషన్‌ తయారైంది. దీని నిమ్మగడ్డ జారీ చేసేశారు. ఎప్పటిలాగే ఎస్‌ఈసీ కార్యాలయం.. ఈ విషయాన్ని ఓ వర్గం మీడియాకు లీక్‌ చేసేసింది. ఆ మీడియా ద్వారా జరిగిన తప్పు తెలుసుకున్న నిమ్మగడ్డ.. నోటిఫికేషన్‌ను సరిచేసి జరిగిన తప్పును దిద్దుకున్నారు.  (చదవండి: కరోనాకు బలి చేయవద్దని కోరుతున్నాం)

తప్పుల తడక తేదీలతో నిమ్మగడ్డ సంతకం చేసిన నోటిఫికేషన్‌ 

మరిన్ని వార్తలు