ఏపీ ఎస్‌ఈసీగా ముగిసిన నిమ్మగడ్డ పదవీ కాలం

31 Mar, 2021 18:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పదవీకాలం ముగిసింది. బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన పదవీ విరమణ చేశారు. పదవీకాలం ముగియడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కి బయలుదేరారు. రేపు(గురువారం) ఉదయం 9.30 కొత్త ఎస్‌ఈసీగా మాజీ ప్రధాన‌ కార్యదర్శి నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం జెడ్పీ ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, జెడ్పీ ఎన్నికలకి ఇప్పటికే కోర్టు అడ్డంకులు తొలగిన సంగతి తెలిసిందే. ఏకగ్రీవాలని ప్రకటించాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఏకగ్రీవాలని మినహాయించి మిగిలిన జెడ్పిటీసీ, ఎంపీటీసీ స్ధానాలకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు