సాక్షి ఫొటోగ్రాఫర్లకు జాతీయ స్థాయి అవార్డులు

18 Aug, 2022 08:43 IST|Sakshi

నేడు విజయవాడలో ప్లాటినం జూబ్లీ ఇమేజ్‌ అవార్డుల ప్రదానం

సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో తొమ్మిదిమంది సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ మధ్యలో తీసిన ఫొటోలను పోటీలకు ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా 463 మంది 826 ఫొటోలను పంపించారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, సోషల్‌ ఆంత్రోపాలజిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌.విజయ్‌కుమార్‌రెడ్డి, సోషల్‌ హిస్టోరియన్‌ డాక్టర్‌ కొంపల్లి హెచ్‌.హెచ్‌.ఎస్‌.సుందర్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి 75 ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపికచేశారని అకాడమీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అకాడమీ ఆవిర్భావ దినోత్సవం (ఆగస్టు 18వ తేదీ) సందర్భంగా విజేతలకు గురువారం విజయవాడలో ‘ప్లాటినం జూబ్లీ ఇమేజ్‌ అవార్డులు’ ఇవ్వనున్నట్లు చెప్పారు. 75 చిత్రాలతో ఫొటో ప్రదర్శన ఏర్పాటుచేసి, ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరిస్తామని తెలిపారు. 

అవార్డులు పొందిన సాక్షి ఫోటోగ్రాఫర్లు: 
వి.రూబెన్‌ బెసాలియల్‌ (విజయవాడ), ఎన్‌.కిషోర్‌ (విజయవాడ), ఎస్‌.లక్ష్మీపవన్‌ (విజయవాడ), పి.ఎల్‌. మోహనరావు (వైజాగ్‌), ఎండీ నవాజ్‌ (వైజాగ్‌), వడ్డే శ్రీనివాసులు (కర్నూలు), కె.మోహనకృష్ణ (తిరుపతి), మహబూబ్‌ బాషా (అనంతపురం), శివ కొల్లోజు (తెలంగాణ).

ఇదీ చదవండి: YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం

మరిన్ని వార్తలు