కిలిమంజారోపై చిన్నారి రిత్విక

2 Mar, 2021 11:03 IST|Sakshi
పర్వతంపై జాతీయ జెండా, కలెక్టర్‌ గంధం చంద్రుడు ఫొటోను ప్రదర్శిస్తున్న చిన్నారి రిత్విక

అనంతపురం: ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరంగా ఖ్యాతిగాంచిన కిలిమంజారో పర్వతాన్ని జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి రిత్విక గత శుక్రవారం అధిరోహించింది. పర్వతం శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత జాతీయడ జెండాతో పాటు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఫొటోను చిన్నారి ప్రదర్శించింది. కాగా, తాడిమర్రి మండలం ఎం.అగ్రహానికి చెందిన కడపల శంకర్‌ కుమార్తె రిత్విక.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా అరుదైన రికార్డుకు దూరమవుతున్నట్లు తెలుసుకున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.2,98,835 ఆర్థిక సాయాన్ని అందేలా చేశారు. రికార్డుల సాధనకు బయలుదేరిన చిన్నారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన కలెక్టర్‌ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబట్టుకోవడం విశేషం.
చదవండి:
ప్రేమకు ద్రోహం చేయకూడదనుకున్నా..
కదులుతున్న అవినీతి డొంక: ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు

మరిన్ని వార్తలు