ఐదేళ్ల జీఎస్టీ పరిహారం చెల్లిస్తాం

15 Mar, 2022 05:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  నిబంధనల ప్రకారం ఐదేళ్లపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు.

పొందూరు ఖాదీకి జీఐ గుర్తింపు ఇవ్వాలి
పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగింగ్‌ ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ డిమాండు చేశారు.  

ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌ ఏర్పాటు చేయాలి
కేంద్రం తిరుపతిలో ఎలక్ట్రికల్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. 

పాయకరావుపేటలో వెదురు క్లస్టర్‌పై లేఖ
పాయకరావుపేటలో వెదురు క్లస్టర్‌ ఏర్పాటు నిమిత్తం ఏపీ బ్యాంబూ మిషన్‌ డైరెక్టర్‌కు నేషనల్‌ బ్యాంబూ మిషన్‌ లేఖ రాసినట్లు వ్యవసాయశాఖ సహాయమంత్రి శోభా కరాంద్లాజే తెలిపారు.  

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువులకు చర్యలు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువులకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప ప్రశ్నకు జవాబు ఇచ్చారు. 

స్మారక కట్టడాలను సంరక్షిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్‌లోని 135 స్మారక కట్టడాలను సంరక్షిస్తున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.  వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, ఎన్‌.రెడ్డెప్ప, గురుమూర్తి, గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు.

ఏపీ నుంచి రూ.15.48 కోట్ల యూసీలు
గిరిజన సబ్‌ స్కీం కింద కేంద్రం ప్రత్యేక సాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.15.48 కోట్లకు యూసీలు పంపిందని కేంద్ర  సహాయమంత్రి రేణుక సింగ్‌ సరూతా తెలిపారు. 2020–21కి గిరిజనుల ఆరోగ్యం, విద్య, శానిటేషన్, మంచినీరు పంపిణీ, నైపుణ్యాభివృద్ధి తదితరాలకు రూ.49.54 కోట్లు విడుదల చేశామన్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో అడ్డతీగల, రంపచోడవరంలలో ఏకలవ్య పాఠశాలలు నడుస్తున్నాయని తెలిపారు.ఎంపీలు బాలశౌరి, మార్గాని భరత్‌ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

మరిన్ని వార్తలు