ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి 10 ఐసీయూ బెడ్లు 

6 Jun, 2021 13:06 IST|Sakshi

సాక్షి, అమరావతి : నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో నిర్మాణ్ సంస్థ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చి అత్యాధునికంగా తీర్చిదిద్దేదుoకు ప్రభుత్వం ఇప్పటికే నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజారోగ్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి మౌలిక వసతులను కల్పించడం ద్వారా సుస్థిర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ బాటలు వేస్తున్నారు. పేదలకు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందించేందుకు నిర్మాణ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 

నిర్మాణ్ సంస్థ ఆపరేషన్స్ హెడ్ శ్రీకాంత్ నాథాముని, ఖోశ్లా వెంచర్స్ ఫౌండర్ వినోద్ ఖోశ్లా ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి ముఖ్యకారకులు. ఏపీ ప్రభుత్వం తరపున న ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్, ఉత్తర అమెరికా- రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగా దాతలను గుర్తించి, వారిని విరాళం అందించేలా ప్రోత్సహించనున్నారు. ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా ప్రతి ఐసీయూ యూనిట్ మీద సంబంధిత దాతల పేరు ఉంటుంది. ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం డా. అర్జా శ్రీకాంత్‌ను ముఖ్య అధికారిగా నియమించింది.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు.. ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగైన వైద్య సేవలందించేందుకు సిద్ధం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని జూన్ 5న మంత్రి కల్వకుంట్ల తారక్ రామారావు ప్రారంభించారు. పేదలకు ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా ప్రతి ఒక్కరికీ మా విన్నపం. ఇప్పటికి 22 ప్రభుత్వ వైద్యశాలలకు దాతలు ముందుకు వచ్చారు , ఇంకా విరాళం అందించేందుకు ఆసక్తి ఉన్న దాతలు ఈ క్రింది లింక్ ద్వారా తమ విరాళాన్ని అందించవచ్చు.

మరిన్ని వార్తలు