NIT Tadepalligudem: క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో నిట్‌ విద్యార్థుల సత్తా

4 Oct, 2022 19:54 IST|Sakshi
సూరపరాజు లక్ష్మీకీర్తన, ఊర్వశి డాంగ్‌

తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో నిట్‌ 2018–22 బ్యాచ్‌ విద్యార్థుల్లో 97.19 శాతం మంది ఉద్యోగాలు సాధించారు. సీఎస్‌ఈ విద్యార్థిని సూరపరాజు సాయి కీర్తన అమెజాన్‌లో రూ. 47.3 లక్షల వేతనం పొందగా.. ఈఈఈ విద్యార్థిని ఊర్వశి డాంగ్‌ అమెజాన్‌లో రూ. 47.3 లక్షల వేతనం అందుకోనున్నారు. సీఎస్‌ఈ విద్యార్థి కేతన్‌ బన్సాల్‌ స్కైలార్క్‌ ల్యాబ్స్‌లో రూ. 37.8 లక్షల వేతనం, అదే గ్రూపునకు చెందిన గాదె అశ్రితరెడ్డి అమెజాన్‌లో రూ.37 లక్షల వేతనంతో ఉద్యోగం పొందారు. 

ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ సెల్‌ ప్రత్యేక కృషితో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించారు. దేశంలోని 31 నిట్‌లలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ విషయంలో ఏపీ నిట్‌ సత్తా చాటింది. ఈ బ్యాచ్‌లో 511 మంది 262 కంపెనీలు జరిపిన ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు పొందారు. (క్లిక్ చేయండి: ఒకేసారి డబుల్‌ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..)

మరిన్ని వార్తలు