నివర్‌ తుపాను: శ్రీవారి మెట్టు మార్గం మూసివేత 

26 Nov, 2020 19:51 IST|Sakshi

శ్రీవారి మెట్టు మార్గంలో విరుగుపడుతున్న బండరాళ్లు..

సాక్షి, తిరుమల: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు మార్గం తాత్కాలికంగా మూసివేశారు. నివర్‌ తుపాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు విరిగిపడుతున్నాయి. భక్తులకు ప్రమాదం పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా శ్రీవారి మెట్టు నడకదారిని టీటీడీ అధికారులు మూసివేశారు. భారీ వర్షాలతో తిరుమలలో జలాశయాలు నీటితో నిండాయి. పాప వినాశనం, ఆకాశ గంగ, గొగర్బం, కేపీ డ్యామ్‌ గేట్లు అధికారులు ఎత్తివేశారు.(చదవండి: నివర్‌ తుపాను: చొచ్చుకొచ్చిన సముద్రం)

వాగులో రైతులు గల్లంతు..
చిత్తూరు జిల్లా ఏర్పేడు, మల్లిమడుగు వాగులో ముగ్గురు రైతులు గల్లంతయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇద్దరిని రక్షించగా, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులకు ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అండగా నిలిచారు.

సత్యదేవుని తెప్పోత్సవం నిలిపివేత..
తూర్పుగోదావరి:
తుపాన్‌ కారణంగా అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవాన్ని దేవస్థానం అధికారులు నిలిపివేశారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా రాత్రి 7 గంటలకు జరగాల్సిన తెప్పోత్సవంకు ఆటంకం కలిగింది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథ్‌ తెలిపారు.(చదవండి: ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు)

మరిన్ని వార్తలు