అవిశ్వాసంలో ఓడిపోయిన మేయర్‌ పావని

5 Oct, 2021 13:36 IST|Sakshi

సాక్షి, కాకినాడ: కాకినాడ మేయర్‌పై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో మేయర్‌ పావని, ఉపమేయర్‌-1 సత్తిబాబు ఓడిపోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 33 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫీసియో సభ్యులతో కలిపి మొత్తం 36 ఓట్లు వచ్చాయి. కాకినాడ మున్సిపల్‌ కౌన్సిల్‌లో 44 మంది కార్పొరేటర్లు ఉండగా, మరో ముగ్గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానానికి కోరం 31 మంది ఉండాల్సి నేపథ్యంలో సమావేశానికి 43 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు.  

ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు. అయితే కోర్టు కేసు నేపథ్యంలో ఫలితాలను ప్రిసైడింగ్‌ అధికారి రిజర్వ్‌ చేశారు. కోర్టు తీర్పు తర్వాత ఫలితాలనుఅధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


చదవండి: (సుంకర పావని టీడీపీని భ్రష్టు పట్టించారు: కార్పొరేటర్లు)

మరిన్ని వార్తలు