అంతుచిక్కని వ్యాధి: యంత్రాంగం అప్రమత్తం

22 Jan, 2021 16:37 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: కొమరవోలు, పూళ్లలో కొందరు అస్వస్థతకు గురయ్యారని.. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగమంతా అప్రమత్తమైందని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తెలిపారు.అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. సీఎస్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ కమిషనర్లు ఏలూరు, పూళ్ల ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్‌ సమీక్ష)

తాగునీరులో ఎలాంటి సమస్య లేదు: అనిల్‌కుమార్‌ 
పూళ్ల గ్రామంలోని తాగునీరులో ఎలాంటి సమస్య లేదని వైద్య, ఆరోగ్యశాఖ చీఫ్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై విచారణ చేస్తున్నామని.. తాగునీరు, ఆహారం, కూరగాయల శాంపిల్స్‌ తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 22 మందిలో ఐదుగురు డిశ్చార్జ్‌ అయ్యారని.. అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలిచ్చారని చెప్పారు.  సీఎంకు సాయంత్రం నివేదిక ఇస్తామని అనిల్‌కుమార్‌ తెలిపారు. చదవండి: గ్రామాల్లో అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు