సీఎం జగన్‌ ప్రభుత్వం పేదవాడిని గెలిపిస్తోంది

31 Aug, 2020 15:03 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: సంచార జాతుల 68వ స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు వైఎస్సార్‌సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సంచార జాతుల వారిని గత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ సంచార జాతుల వారిని పట్టించుకోలేదని విమర్శించారు. సంచార జాతుల వారి కోసం ప్రత్యేక అధ్యయన కమిటీని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా ఐదు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. సంచార జాతుల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్‌ అమలు చేశారని తెలిపారు. బీసీ పక్షపాతి సీఎం జగన్‌ బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి వారికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశారని వ్యాఖ్యానించారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని కొనియాడారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించారని తెలిపారు. (భూ సర్వే పైలట్‌ ప్రాజెక్టుపై సీఎం జగన్‌ సమీక్ష)

అదే విధంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సంచార జాతుల వారు తమ సమస్యలను పాదయాత్రలో సీఎం జగన్‌ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. పాదయాత్రలో వారికి ఇచ్చిన హామీలన్నింటిని సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారని పేర్కొన్నారు. సంచార జాతుల వారి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. బాబు పాలనతో బీసీలు విసిగిపోయారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. పేదరికంపై గెలుపు కోసం ‘నవ రత్నాల పథకాలు’ ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పేదవాడిని గెలిపిస్తోందని పేర్కొన్నారు. (సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన)

మరిన్ని వార్తలు