మూగ‌జీవాల‌కు పెళ్లి విందు, రూ.65వేల‌తో ఏర్పాటు

6 Jun, 2021 12:27 IST|Sakshi

నెల్లూరు:మ‌న‌దేశంలో పెళ్లిళ్లు భారీ ఎత్తున‌, హంగు ఆర్భాటాల‌తో అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతాయి.కానీ క‌రోనా కార‌ణంగా కాబోయే నూత‌న వ‌ధువరులు పెళ్లి ఖ‌ర్చులు త‌గ్గించుకుంటున్నారు. క‌రోనా క‌ష్టకాలంలో బాధితుల‌కు, మూగ జీవాల‌కు అండ‌గా నిలుస్తున్నారు. అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటున్నారు. 

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా మానవాళి మనుగడ ప్రశ్నర్థకంగా మార్చింది. ఈ స‌మ‌యంలో  పలువురు దాతలు... పేదలు, కార్మికులు, నిర్వాసితులకు పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నారు.ఈ క్లిష్ట సమయంలో మూగ జీవాల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. ఆహారం కోసం అల్లాడిపోతున్నాయి. సరైన తిండి, తాగునీరు దొరక్క అలమటించిపోతున్నాయి. అయితే ఈ నేప‌థ్యంలో నూత‌న వ‌ధువరులు త‌మ‌ పెళ్లి సంద‌ర్భంగా మూగ జీవాల‌కు పెళ్లి విందును ఏర్పాటు చేశారు. దీంతో ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

నార్త్ ఇండియాకు చెందిన ఓ కుటుంబం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లాలో నివాసం ఉంటుంది. అయితే కుటుంబంలో నిఖిల్ - ర‌క్షల వివాహం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌ధువ‌రులు జిల్లాకు చెందిన జంతు సంర‌క్ష‌ణ శాల‌లో మూగ జీవాల‌కు రూ.60వేల‌తో పెళ్లి విందును ఏర్పాటు చేశారు. జంతు సంర‌క్ష‌ణ‌శాల‌లో ఉన్న గోవులు, వానరం, కోళ్లు, కుందేళ్లు ఇలా అన్నీ మూగ జీవాల‌కు ఆహారాన్ని అందించారు. మూగ‌జీవాల‌పై ప్రేమ‌ను చాటుకున్నారు.

మరిన్ని వార్తలు