కోస్తాలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు

29 Oct, 2020 04:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలుల వల్ల రుతుపవనాలు కోస్తాంధ్రతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోకి వచ్చాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఉత్తర తమిళనాడు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 3.1 కి.మీ వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.     

మరిన్ని వార్తలు