విగ్రహం తరలింపు కేసులో అచ్చెన్నాయుడికి నోటీసులు

28 Jan, 2021 10:53 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర  అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంతబొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయం నంది విగ్రహం తరలింపు కేసులో విచారణకు హాజరుకావాలని ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈనెల 14న నంది విగ్రహాన్ని తరలించి పక్కనే ఉన్న మూడు రోడ్ల కూడలిలో విగ్రహాన్ని ప్రతిష్టించి పట్టుబడిన టీడీపీ నేతలు, 16 మందిపై కేసు నమోదు అయ్యింది. విగ్రహం తరలింపు ముందు రోజు వీరంతా అచ్చెన్నాయుడిని కలిసినట్లు పోలీసులు నిర్థారించారు. నిన్న(బుధవారం) అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు. చదవండి: అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్లు

కాగా, అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గ పరిధిలోని సంతబొమ్మాళి మండలంలో మత విద్వేషాలు సృష్టించేందుకు టీడీపీ నాయకులు యత్నించిన సంగతి విధితమే. పాలేశ్వరస్వామి ఆలయంలో శిథిలమైన నంది విగ్రహాన్ని తొలగించి కొత్త నంది విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్ఠించారు. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నాయకులు జీర్ణావస్థకు చేరిన పాత నంది విగ్రహాన్ని తీసుకొచ్చి ఆగమ శాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా పాలేశ్వరస్వామి జంక్షన్‌ వద్ద గల సిమెంట్‌ దిమ్మెపై ఈ నెల 14న గుట్టుచప్పుడు కాకుండా ప్రతిష్ఠించారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఇక్కడ దిమ్మె నిర్మించగా.. మత విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు అక్కడ వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బ్యాచ్‌ పక్కా ప్లాన్‌తో ఆ దిమ్మెపై నంది విగ్రహాన్ని నెలకొల్పింది. చదవండి: ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా

మరిన్ని వార్తలు