ఎంబీబీఎస్‌ మాప్‌–అప్‌ రౌండ్‌–2 కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌

25 Apr, 2022 04:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ నాన్‌–మైనారిటీ/మైనారిటీ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా (బీ, సీ (ఎన్‌ఆర్‌ఐ) సీట్ల భర్తీలో భాగంగా మాప్‌–అప్‌ రౌండ్‌–2 కౌన్సెలింగ్‌కు ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 1 గంటలోపు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్‌ల నమోదుకు అవకాశం కల్పించారు. ఎంచుకున్న ఆప్షన్‌ల ఆధారంగా సీటు కేటాయించిన కళాశాలలో చేరకపోతే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా మూడేళ్లపాటు యూనివర్సిటీ నుంచి డీబార్‌ చేస్తామని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. కాగా బీ కేటగిరి సీట్లు 65, సీ కేటగిరీ సీట్లు 37 అందుబాటులో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు