కనకదుర్గమకుఎన్నారై కనక పుష్యరాగ హారం

19 Oct, 2020 10:33 IST|Sakshi

దుర్గమ్మ ఏడువారాల నగల్లో మరో మణి హారం

సాక్షి, విజయవాడ : విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రూపంలో భక్తులను దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో కనకదుర్గ అమ్మవారి అలంకరణకు వాడే ఏడువారాల నగల్లో మరో మణి హారం వచ్చి చేరింది. ఎన్నారై భక్తుడు తాతినేని శ్రీనివాస్‌ 40 లక్షల రూపాయలు విలువైన కనకపుష్యరాగ హారాన్ని దుర్గమాతకు సమర్పించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో సురేష్‌ బాబు తెలిపారు. ఈ హారాన్ని ప్రతి గురువారం అమ్మవారికి అలంకరించనున్నట్లు వెల్లడించారు. కనకపుష్యరాగాలు అన్ని ఒకే సైజు కోసం సింగపూర్ నుంచి తెప్పించామన్నారు. చదవండి: గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం

అలాగే గత 6 నెలల నుంచి అమ్మవారికి 7 వారాల నగలు అలంకరిస్తున్నామని, భక్తులు ఎవరైనా అమ్మవారికి 7 వారాల నగలు సమర్పించాలనుకుంటారో వారు దేవస్థానంలో సంప్రదించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నారై భక్తుడు తాతినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తాను విజయవాడ స్థానికుడిని అని, కానీ వృత్తి రీత్యా అట్లాంటాలో ఉంటున్నట్లు తెలిపారు. తమ కుమారుడు మొదటి జీతంతో అమ్మవారికి హారం అమ్మవారికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి హారం చేపించి ఇవ్వడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే

అమ్మవారికి అలంకరించే ఏడు వారాల నగలు..
సోమవారం- ముత్యాలు
మంగళవారం- పగడలు

బుధవారం- పచ్చల
గురువారం- కనకపుష్యరాగాలు
శుక్రవారం-డైమండ్
శనివారం-నిలాలు
ఆదివారం-కెంపులు

మరిన్ని వార్తలు