రాష్ట్రంలో కోటి డోసుల టీకా పూర్తి

2 Jun, 2021 05:39 IST|Sakshi

మొదటి డోసు తీసుకున్న వారు 75.45 లక్షలు

వారిలో రెండు డోసులూ తీసుకున్న వారు 25.29 లక్షలు

టీకా ఉంటే.. రోజుకు 6 లక్షలకు పైగా డోసులు వేసే సామర్థ్యం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం సాయంత్రానికి కోటి డోసుల కరోనా టీకా వేశారు. 2021 జనవరి 16న దేశవ్యాప్తంగా మొదలైన టీకా ప్రక్రియ అదేరోజు మన రాష్ట్రంలోనూ మొదలైంది. నాలుగున్నర నెలలు పూర్తయ్యే సరికి కోటి డోసుల టీకాలు వేయడం రాష్ట్రంలో పూర్తయింది. జూన్‌ 1న సాయంత్రానికి 1,00,74,471 డోసుల టీకా వేశారు. టీకా ప్రారంభమైన తొలి రెండు మూడు మాసాలు టీకా కోసం సరిగా ముందుకు రాలేదు.

చాలామంది అవగాహన పెంచుకుని టీకా కోసం వచ్చేసరికి తర్వాత టీకాకు కేంద్రం రేషియో విధించడంతో రాష్ట్రానికి ఎంత కేటాయింపులో అంతే వేయాల్సి వచ్చింది. కొంతమేరకు రాష్ట్రమే వెచ్చించి టీకాను కొనుగోలు చేసిన విషయమూ తెలిసిందే. రోజుకు 6 లక్షలు తక్కువ కాకుండా టీకాలు వేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. కానీ సరిపడా టీకాలు లేకపోవడం వల్లే జాప్యం జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు