కాకినాడ జీజీహెచ్‌లో 100కు చేరిన బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు

26 Jun, 2021 04:29 IST|Sakshi

కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్‌ ఫంగస్‌తో శస్త్ర చికిత్స చేయించుకున్న వారి సంఖ్య వందకు చేరింది. నెల రోజులుగా కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 280 మంది ఆస్పత్రిలో చేరగా, వీరిలో రికార్డు స్థాయిలో వంద మందికి వేగంగా ఆపరేషన్లు చేయడం విశేషం. ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్‌ కృష్ణకిషోర్‌ ఆధ్వర్యంలో.. అప్పారావు వైద్య బృందం నిరంతరాయంగా శస్త్ర చికిత్సలు చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 మంది బ్లాక్‌ ఫంగస్‌ రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.   

మరిన్ని వార్తలు