ఓఎన్‌జీసీకి ఎన్‌జీటీ భారీ జరిమానా

2 Aug, 2022 18:58 IST|Sakshi

అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ)కి భారీ జరిమానా విధించింది జాతీయ హరిత ట్రైబ‍్యునల్‌(ఎన్‌జీటీ). కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి కారణమైనందున రూ.22.76 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఓఎన్‌జీసీపై చర్యలకు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ను ప్రాజెక్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. సంయుక్త కమిటీ నివేదిక ఆధారంగా ఓఎన్‌జీసీకి భారీ జరిమానా విధించినట్లు తెలిపింది. 

యెనుమల వెంకటపతి రాజు పిటిషన్‌పై విచారణ చేపట్టిన హరిత ట్రైబ్యునల్‌- (ఎన్‌జీటీ) తీర్పు వెలువరించింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఈ జరిమానా విధించింది.

ఇదీ చదవండి: ‘విద్యారంగంలో దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తెచ్చాం’

మరిన్ని వార్తలు