ఆకాంక్ష జిల్లాల జాబితాలో మన్యం, అల్లూరి జిల్లాలు

20 Oct, 2022 19:12 IST|Sakshi
సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ మాధవి

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి

కొయ్యూరు: మన్యం పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఆకాంక్ష జిల్లాల జాబితాలో చేరాయని అరకు ఎంపీ మాధవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలిసి అందించిన లేఖ మేరకు నీతి అయోగ్‌ నిర్వహించిన సమావేశంలో ఆకాంక్ష జిల్లాల జాబితాలో వాటిని చేర్చారన్నారు. 

రెండు జిల్లాలు వెనుకబడి ఉన్నందున అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థిక చేరిక, నైపుణ్యాభివృద్ధి, మౌలిక   సదుపాయాలు తదితర సౌకర్యాలు అందుతాయన్నారు.  

విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో.. 
అరకు ఎంపీ మాధవి బుధవారం ఢిల్లీ నిర్వహించిన విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. (క్లిక్ చేయండి: మెట్ట భూములకు పాతాళగంగ)

మరిన్ని వార్తలు