పార్వతీపురం ఎమ్మెల్యేకు మాతృవియోగం

7 May, 2022 16:06 IST|Sakshi
సంతోషమ్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

సాక్షి, పార్వతీపురం మన్యం(బలిజిపేట): పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు తల్లి, బలిజిపేట మండలం మాజీ ఎంపీపీ అలజంగి సంతోషమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆమె కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చిలకలపల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె 2001–06లో బలిజిపేట ఎంపీపీగా పనిచేశారు. ఆమె భర్త స్వర్గీయ అలజంగి సత్యం చిలకలపల్లి సర్పంచ్‌గా 1987–1998 వరకు పనిచేశారు. వీరికి ఆరుగురు మగపిల్లలు. వీరిలో ఎమ్మెల్యే జోగారావు 6వ సంతానం. బలిజిపేట మండలం జెడ్పీటీసీ సభ్యుడు ఎ.రవికుమార్‌ 4వ వాడుకాగా, ప్రస్తుత చిలకలపల్లి సర్పంచ్‌ సుందరావు 3వ సంతానం.

సంతోషమ్మ కోడలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రి సూపరెంటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ వాగ్దేవి. సంతోషమ్మ మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. ఆమె కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌.జయమణి, టిడ్కోచైర్మన్‌ జమ్మానప్రసన్నకుమార్, వ్యవసాయ సలహామండలి జిల్లా చైర్మన్‌ వి.నాగేశ్వరరావు, పార్వతీపురంమున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బి.గౌరీశ్వరి, వైస్‌ చైర్మన్‌లు రుక్మిణిబాలకృష్ణ, గున్నేశ్వరరావు, కమిషనర్‌ సింహాచలం, నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పరామర్శించారు.  


తల్లి మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే జోగారావు 
  

మరిన్ని వార్తలు