Vande Bharat Express: రైలును అపరిశుభ్రంగా మార్చేసిన ప్రయాణికులు

23 Jan, 2023 11:54 IST|Sakshi
వందేభారత్‌ రైలులో ఇదీ పరిస్థితి..                     

సాక్షి, విశాఖపట్నం : ఓవైపు ఇండియా.. స్వచ్ఛతలో ప్రపంచ దేశాలకు దిక్సూచీగా మారేందుకు పరుగులు పెడుతుంటే.. కొందరిలో మాత్రం పరిశుభ్రతపై పూర్తిస్థాయిలో అవగాహన కొరవడుతోంది. ఇటీవల ప్రారంభమైన సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌లో పరిస్థితి దీనికి అద్దం పడుతోంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వచ్చిన వందేభారత్‌ రైలులో టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి.


 విరిగిన కుర్చీ

తినుబండారాలు కిందపడేస్తూ రైలులోని ప్రతి కోచ్‌ను అపరిశుభ్రంగా మార్చేస్తున్నారు. విశాఖ వచ్చేసరికి వందేభారత్‌ రైలు కాస్తా చెత్తబుట్టగా మారిపోతుంది. విషయం తెలుసుకున్న వాల్తేరు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి ఆవేదన వ్యక్తం చేశారు. రైలును పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత రైల్వే సిబ్బందిపైనే కాకుండా.. ప్రతి ఒక్క ప్రయాణికుడిపైనా ఉందని సూచించారు.     
చదవండి: స్వచ్ఛ జల్‌ సే సురక్ష.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఏపీ

మరిన్ని వార్తలు