హోమ్‌ క్వారంటైన్‌కు పవన్‌కల్యాణ్‌

12 Apr, 2021 03:12 IST|Sakshi

వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత, భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారిన పడడంతో ముందు జాగ్రత్తగా డాక్టర్ల సూచనలతో ఆయన హోమ్‌ క్వారంటైన్‌కు వెళ్లినట్టు ఆ పార్టీ మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. డాక్టర్ల సూచనతో ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారని, రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారని పేర్కొంది. టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారని వివరించింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు