పొలాల్లో దిగకుండానే పవన్ పరామర్శ

2 Dec, 2020 12:22 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, కృష్ణా: ‘నివర్‌ తుపాన్’‌ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ ‌కల్యాణ్ పర్యటించారు. బుధవారం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో దెబ్బతిన్న పంటలను పవన్‌ పరిశీలించారు. పంట పొలాల్లో దిగకుండానే పవన్‌ రైతులను పరామర్శించడం గమనార్హం. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నివర్ తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని, రైతన్నకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని అన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని, రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తానన్నారు. నష్టపోయిన పంటలను రైతులు పవన్ కల్యాణకు చూపించారు. ఎకరాకు రూ.౩౦వేల వరకు ఖర్చు పెట్టామని రైతులు తెలిపారు. నివర్ తుపానుతో సర్వం నష్టపోయామని, ఇప్పటికీ పొలాల్లోంచి నీరు బయటకుపోలేదన్నారు. మరోవైపు ఉయ్యూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పవన్‌ వెంట వెళ్తున్న జనసేన కార్యకర్తల బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జనసేన కార్యకర్తలు గాయలపాలయ్యారు. దీంతో స్థానికులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు