గ్రాము గోల్డ్.. రెండు గంటలు.. సూక్ష్మ బంగారు ‘ఆస్కార్‌’..

15 Mar, 2023 10:11 IST|Sakshi

సాక్షి, పెద్దాపురం(కాకినాడ జిల్లా): నాటు నాటు పాటతో ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బృందానికి అభినందనలు తెలుపుతూ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ అవార్డు గ్రహీత, కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన బంగారు శిల్పి తాళాబత్తుల సాయి సూక్ష్మ ఆస్కార్‌ అవార్డు ప్రతిమ రూపొందించారు.

ఒక గ్రాము బంగారం వినియోగించి 15 మిల్లీ మీటర్ల పొడవుతో ఈ ప్రతిమను రెండు గంటల సమయంలో తయారు చేసి అందరి మన్ననలూ అందుకున్నారు. 
చదవండి: రాజమౌళితో మాట్లాడటానికి ప్రయత్నించా, కానీ: RRR నిర్మాత

మరిన్ని వార్తలు